విద్యార్థి ప్రతిభకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ నగదు పురస్కారం

07-11-2026 | 11:20pm

రాజాపూర్: మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(PM SHRI Zilla Parishad High School)లో    గత సంవత్సరం పదవ తరగతి ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 549 మార్కులు సాధించి మండల స్థాయిలోని మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్న విద్యార్థిని ఏ స్రవంతి(Student Sravanthi)కి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్(Shriram Life Insurance) సంస్థ అందించే నగదు పురస్కారంకు ఎంపికైనట్లు  ప్రధాన ఉపాధ్యాయులు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు.

శనివారం మహబూబ్ నగర్ శాసనసభ్యులు యన్నం శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో శ్రీరామ్ లైఫ్ గ్రూప్ వారు ఏర్పాటు చేసిన సన్మాన సమావేశంలో శాలువా ప్రశంసాపత్రాలు  పదివేల రూపాయల చెక్కుతో అందించి సత్కరించారు. విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచినందుకు పాఠశాల ఉపాధ్యాయులకు కృషి అమోఘమైనది అని  తల్లిదండ్రులు సహకారం ఎంతో ఉందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో మొదటి స్థానం తీసుకురావడానికి అహర్నిశలు కృషి చేస్తామని అందుకు విద్యార్థులు మరియు తల్లిదండ్రుల యొక్క సహకారం అవసరమని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు