చాచా నెహ్రూ మా జిల్లా నేతలను మన్నించు

14-11-2026 | 07:51pm

అధ్వాన్నంగా మారిన విగ్రహాన్ని పట్టించుకునే నాథుడు కరువు...

ఆదిలాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆదిలాబాద్(Adilabad) పట్టణం లోని దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) విగ్రహాన్ని పట్టించుకునే నాథుడు కరువయ్యారు. గతంలో జిల్లా కేంద్రంలోని అన్ని చౌరస్తాలను పునరుద్ధరించినప్పటికీ గాంధీ, నెహ్రూ చౌక్(Gandhi, Nehru Chowk) ను మాత్రం విస్మరించారు. మార్కెట్ యార్డ్ (Market Yard) వద్ద ఉన్న నెహ్రూ విగ్రహానికి గత కొన్నేళ్లుగా రంగులు వేయకపోవడంతో విగ్రహం రంగులు పెచ్చులు ఊడుతున్నాయి. విగ్రహం సైతం శిథిలావస్థకు చేరుకుంటుంది. నెహ్రూ తమ నాయకుడు అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ(Congress Party) శ్రేణులతో పాటు ఇతర పార్టీల నాయకులు సైతం ఎవ్వరు పట్టించుకోకపోవడంతో విగ్రహం శిథిలావస్థకు చేరుకుంటుంది. 

ఎన్నో ఏళ్లుగా నెహ్రూ జయంతి, వర్థంతి సందర్భంగా నాయకులు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేసి వెళ్తున్నారే తప్ప అధ్వాన్నంగా మారిన విగ్రహం గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు