వడ్లూరులో ఆధ్యాత్మిక వేడుకలు.. హరీష్ రావుకు ఆహ్వానం
బెజ్జంకి, విజయక్రాంతి: బెజ్జంకి మండలంలోని(Bejjanki Mandal) వడ్లూరు గ్రామంలో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ స్వయంభు కాలభైరవ స్వామి(Sri Swayambhu Kala Bhairava Swamy) ప్రతిష్ట మహోత్సవానికి హాజరుకావాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుకు(Tanniru Harish Rao) ఆలయ కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు(BRS leaders) ఆహ్వాన పత్రిక అందజేశారు.
ఈ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న మహోత్సవ కార్యక్రమాల వివరాలను వివరించి, వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు గౌతమ్ రావు, పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, శ్రీనివాస గుప్త, నలువాల స్వామి యాదవ్, కల్లూరి అజయ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.