శాంతినికేతన్ పాఠశాలలో బాలల దినోత్సవం

14-11-2026 | 07:35pm

నిర్మల్,(విజయక్రాంతి): నేటి బాలలే రేపటి పౌరులని కాకతీయ యూనివర్సిటీ మాజీ పాలకవర్గ సభ్యులు ఎంపీపీ సత్యనారాయణ గౌడ్ అన్నారు. పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు . నెహ్రు చాచా చిత్రపటానికి పూజలు చేశారు. పిల్లలు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. స్వయం పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.

పిల్లలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. నెహ్రూకు పిల్లలంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. పిల్లలు బాగా చదువుకుని దేశ భవిష్యత్తు కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండ, డైరెక్టర్ భగవతి పద్మనాభ గౌడ్. ప్రధాన ఉపాధ్యాయులు శ్రీకాంత్, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు