ఇంటర్ బోర్డు విలీనాన్ని విరమించుకోవాలి
టీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్
బెల్లంపల్లి: ఇంటర్మీడియేట్ విద్యను(Intermediate education) పాఠశాల విద్యాశాఖలో(Department of School Education) విలీనం నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) రాష్ట్ర అధికార ప్రతినిధి సిద్ధంశెట్టి సాజన్ డిమాండ్ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మొత్తం విద్యారంగంలో(Education Sector) వినూత్న ఆవిష్కరణలతో ముందుకు సాగుతుంటే, తెలంగాణలో ప్రభుత్వం మాత్రం విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే నిర్ణయాలు తీసుకుంటోందంటూ మండిపడ్డారు.
ఇంటర్మీడియేట్ విద్యను తీసేసి సీనియర్ సెకండరీ విధానాన్ని అమలు చేయాలన్న ప్రతిపాదనను తెలంగాణ రక్షణ సేన(Telangana Rakshana Sena) తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఖండించారు. ఆరు దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను(Intermediate Education System) మార్చాలంటే దానిపై విస్తృత స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, కాలేజీ యాజమాన్యాలతో చర్చలు జరపకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయం వేలాది జూనియర్ కాలేజీల భవిష్యత్తుతో పాటు లక్షలాది విద్యార్థుల విద్యా అవకాశాలను ప్రభావితం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
టెన్త్ తర్వాత 40 శాతం డ్రాప్ అవుట్లు ఉన్నాయంటూ ప్రభుత్వం చెబుతున్న దానిపై స్పష్టత ఇవ్వాలని సాజన్ డిమాండ్ చేశారు. ఏ ప్రతిపాదికన 40 శాతం డ్రాపట్లు ఉన్నాయని, ప్రభుత్వం చెబుతోందని ప్రశ్నించారు. పదో తరగతి తర్వాత ఇంటర్మీడియట్లో చేరని ప్రతి విద్యార్థి చదువు మానేసినట్లేనా? పాలిటెక్నిక్, ఐటీఐ, డిప్లమా వంటి వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థులను కూడా డ్రాప్ అవుట్లుగా పరిగణిస్తున్నారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఏ విద్యా సంవత్సరం గణాంకాలను, ఏ లెక్కింపు విధానాన్ని ఆధారంగా తీసుకుందో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రస్తుతం ఉన్న స్కూళ్లలోనే అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని,ఇలాంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియేట్ ను కూడా విద్యాశాఖలో కలిపితే అందరికీ వసతులు కల్పించటం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. MPC, BiPC, CEC, MEC వంటి విభిన్న కోర్సులకు అవసరమైన లెక్చరర్లు, ల్యాబ్, సౌకర్యాలు ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకుంటామని చెబుతున్న నిర్ణయం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం ఉందన్నారు.
ఇంటర్మీడియేట్ విద్యను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తే విద్యారంగం పూర్తిగా కార్పొరేట్ సంస్థల కబంధ హస్తల్లోకి వెళ్తుందని సాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ విద్యా సంస్థలు పాఠశాల విద్యలోనూ అడుగు పెట్టి మొత్తం విద్యా వ్యవస్థనే కబ్జా చేస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయకుండా వ్యవస్థాగత మార్పులు చేస్తే దానివల్ల ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే ప్రయోజనం దక్కుతుందన్నారు. ప్రభుత్వం చెప్పే మార్పుల కారణంగా IIT, JEE, NEET వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమైన ప్రత్యేక బోధనను ఎలా కొనసాగిస్తారో చెప్పాన్నారు.
రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో తల్లితండ్రులు పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ లో నూ ఉచిత విద్యను అమలు చేయాలని..ఫీజుల భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరించేలా ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.