మరికాల కొత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాలల దినోత్సవ

14-11-2026 | 07:41pm

వెంకటాపురం, నూగూరు, నవంబర్ 14, విజయక్రాంతి: వెంకటాపురం మండలం(Venkatapuram Mandal), ఎంపిపిఎస్ మరికాల కొత్తూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(MPPS Marikala Kothuru Government Primary School) బాలల దినోత్సవ వేడుకలను(Children's Day Celebration) నవంబర్ 14న ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవంతో పాటు విద్యార్థులే(Students') పాలకులుగా మారి పాఠశాల బాధ్యతలను నిర్వహించే స్వయం పాలన దినోత్సవాన్ని కూడా ఉత్సాహభరితంగా జరిపారు. విద్యార్థులు వివిధ పాత్రలు పోషిస్తూ తమ ప్రతిభను చాటుకున్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పోటీలు, బహుమతుల ప్రదానంతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు కాపుల విజయ్ మాట్లాడుతూ. బాల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో మధురమైన దశ అని, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారిలో ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఇటువంటి కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు.పిల్లల ముఖాల్లో చిరునవ్వులు, వారి కళ్లలో ఆనందం, కార్యక్రమాల్లో వారి ఉత్సాహం అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు