ఆర్యవైశ్యుల ఐక్యతే సమాజాభివృద్ధికి పునాది

14-11-2026 | 07:35pm

నిరుపేదలకు అండగా ఉండాలి

రాజకీయ రంగంలోనూ రాణించాలి 

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ముఖ్య సలహాదారు నలమాస్ కాంతయ్య పిలుపు 

లక్షెట్టిపేట, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆర్యవైశ్యులు(Arya Vaisyas) ఐక్యతే సమాజాభివృద్ధికి పునాది అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ(Telangana State Arya Vysya Mahasabha) ముఖ్య సలహాదారులు నలమాస్ కాంతయ్య అన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా(Mancherial District) లక్షెట్టిపేట మండల ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అదనపు ప్రధాన కార్యదర్శి ముక్త శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని, సమాజంలోని పేదలను గుర్తించి వారికి తగిన సహాయం అందించాలని కోరారు.సంఘంలో పదవులు చేపట్టడమంటే బాధ్యతలను స్వీకరించడమేనన్నారు. పదవులను సమాజ అభ్యున్నతికి పాటుపడేలా వినియోగించాలన్నారు. కేవలం వ్యాపార రంగానికే పరిమితం కాకుండా సమాజ సేవలో ముందుండాలని సూచించారు. అంతేకాకుండా రాజకీయ రంగంలోనూ తమదైన ముద్ర వేయాలని దిశ నిర్దేశం చేశారు.

అనంతరం నూతన కార్యవర్గ సభ్యులతో మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కొత్త వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి చిలువేరు వైకుంఠం ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన అధ్యక్షులుగా గౌరిశెట్టి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా కటకం అశోక్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కుంజర్ల శ్రీనివాస్, కోశాధికారిగా బొద్దుకూరి నరేష్ బాధ్యతలు స్వీకరించారు. నూతన కార్యవర్గ సభ్యులను పలువురు సంఘ నాయకులు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించి అభినందించారు.

కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు లక్షెట్టిపేట మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు వొజ్జల రాజమౌళి, గుండ ప్రభాకర్, లక్షెట్టిపేట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు చెట్ల రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వొజ్జల శ్రీనివాస్, ఐక్య వ్యాపార సంఘం అధ్యక్షులు మైలారపు సుధాకర్, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు గడ్డం వికాస్, అవోపా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంజర్ల శ్రీనివాస్, పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు నరేందుల సాహితి, ప్రధాన కార్యదర్శి హారతి, కోశాధికారి కాసం స్వప్న, చింతల రంజిత్, బొద్దుకూరి రాజ్‌కుమార్, ఏలుగూరి వేణు తదితర ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు