కరీంనగర్ లో అల్లర్లు స్రుష్టించేందుకు కుట్ర
జిల్లా అదనపు కలెక్టర్, కమిషనర్ లకు బీజేపీ కార్పొరేటర్ల ఫిర్యాదు
ముకరంపుర, నవంబర్ 14(విజయక్రాంతి): కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్(Karimnagar Municipal Corporation) అనుమతి లేకుండానే ఈద్గా వద్ద రిటైనింగ్ వాల్ కట్టి(Constructing a retaining wall), మొక్కలు నాటి, మత విద్వేషాలు రగిలించాలని కుట్ర చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ కార్పొరేటర్లు(BJP Corporators) శనివారం జిల్లా అదనపు కలెక్టర్ అశ్వనీ తానాజీ వాకడే(Ashwini Tanaji Wakade), నగర పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం(Police Commissioner Ghouse Alam) ను కోరారు. ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందున్న ఈద్గా వద్ద కొందరు వ్యక్తులు ఈనెల 11న రిటైనింగ్ వాల్ కట్టేందుకు కంకర, ఇసుకను తీసుకొచ్చి జేసీబీతో పనులు ప్రారంభించారని ఫిర్యాదు చేశారు.
అక్కడే మొక్కలు నాటాలని యత్నించారని పేర్కొన్నారు. ఈ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ అనుమతి లేదని, కనీసం అనుమతి కూడా కోరలేదని గుర్తు చేశారు. హిందూ, ముస్లిం వర్గాల మధ్య మత విద్వేషాలు రగిలించి గొడవలు స్రుష్టించేందుకు కుట్ర చేసినట్లు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్య నేత హస్తం ఉన్నట్లు భావిస్తున్నట్లు తెలిపారు.
వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని ఏ ఉద్దేశంతో ఈ కుట్రకు తెరదీశారో సమగ్ర విచారణ జరపాలని కోరారు. ప్రశాంతమైన కరీంనగర్ లో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఝప్తి చేశారు. బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్, కార్పొరేషన్ విప్ బోయినిపల్లి ప్రవీణ్ రావు, కార్పొరేటర్లు బండ రమణారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుజ్జ శ్రీను, ఉప్పరపల్లి శ్రీనివాస్ తదితరులు అదనపు కలెక్టర్, పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో ఉన్నారు.