ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం?

14-11-2026 | 08:00pm

బీజేపీ  సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి

నేరేడుచర్ల,నవంబర్14(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల(Congress government elections) సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తోందని, ఆ హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రతిపక్ష నాయకులను(opposition leaders) ముందస్తు అరెస్టుల పేరుతో నిర్బంధించడం సిగ్గుచేటని భాజపా సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతరెడ్డి(BJP Suryapet District President Challa Srilatha Reddy)అన్నారు.

రాహుల్ గాంధీ(Rahul Gandhi) హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు(N. Ramachander Rao), బీజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజకీయ కార్యక్రమాలు నిర్వహించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడం ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు అని,ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా నిరంకుశ వైఖరిని విడనాడి, అక్రమ అరెస్టులను ఆపాలని, అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు