జ్ఞాన దేవాలయాలు: గురుకుల కళాశాలలు

14-11-2026 | 07:45pm

మహిళా డిగ్రీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం

మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్

కుత్బుల్లాపూర్, నవంబర్ 14(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సంస్థ(Central Government Organization) హెచ్ఏఎల్ కంపెనీ(HAL Company) సౌజన్యంతో సీఎంసీ నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లి లో దాదాపు 22.50 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతన వసతులతో మూడు అంతస్తుల్లో నూతనంగా నిర్మించిన తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, మహిళా డిగ్రీ కళాశాల(Telangana Social Welfare Residential Girls School and Degree College) నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.రవి ముఖ్యఅతిథులుగా హాజరై కళాశాల భవనాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలికలకు ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ పేద విద్యార్థినిల కలలకు రెక్కలు తొడుగుతూ గురుకుల విద్యాసంస్థలు మరింత అభివృద్ధి చెందాలన్నారు. పేద విద్యార్థినిల విద్యాభివృద్ధికి కృషి చేస్తూ ప్రభుత్వ కళాశాలల నిర్మాణం ద్వారా హెచ్ఏఎల్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు.

విద్యార్థినుల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకొని తరగతి గదులు, బోధనా ప్రయోగశాలలు, పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రత్యేక విభాగాలు, పరిపాలనా కార్యాలయాలు, క్రీడలు, ఇతర వినోద కార్యకలాపాలకు సంబంధించిన సౌకర్యాలను సమగ్రంగా ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఏఎల్ డైరెక్టర్ ఎం.జి.బాలసుబ్రమణ్య, సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.విజయేంద్ర బోయి,  సెక్రెటరీ జి.రవి, ఎస్సీ కార్పొరేషన్ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ మల్లయ్య భట్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. ఇష్రత్, కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు