నెహ్రూ ఆశయాలే మన బాలల భవిష్యత్తు
బాలల దినోత్సవం
చిన్నారుల ఆటపాటలు కూచిపూడి నాట్యాలు ఆకర్షణీయంగా నిలిచాయి...
గుమ్మడిదల నవంబర్ 14 : భారతదేశ తొలి ప్రధానమంత్రి, బాలల ప్రియ నాయకులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గుమ్మడిదల మండలంలోని శ్రీ వివేకానంద స్మార్ట్ కిడ్స్ హై స్కూల్(Sri Vivekananda Smart Kids High School), డాన్ బాస్కో హై స్కూల్, సిఎంఆర్, వివేకానంద గ్లోబల్ హై స్కూల్, ఏఎస్ విద్యా విహార్ హై స్కూల్, అభ్యుదయ హై స్కూల్, తదితర ప్రైవేట్ పాఠశాలల్లో బాలల దినోత్సవాన్ని(Children's Day) ఘనంగా నిర్వహించారు. పాఠశాలల్లో చిన్నారులు రంగురంగుల దుస్తులు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు.
వ్యాసరచన, చిత్రలేఖనం, పాటలు, నృత్యాలు, ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా శ్రీ వివేకానంద స్మార్ట్ కిడ్స్ పాఠశాల ప్రిన్సిపల్ చిమ్ముల లతా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నేటి పిల్లలే దేశానికి భవిష్యత్ తరాలకు దిక్సూచిగా ఉండాలని సూచించారు నెహ్రూజీ పిల్లలను ఎంతో ప్రేమించేవారు.
పిల్లల చేతుల్లోనే భారతదేశపు భవిష్యత్తు ఉందని గుర్తు చేశారు. పిల్లలు చదువుతో పాటు క్రమశిక్షణ, మానవత్వం, దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. బాలల హక్కులు, ఆరోగ్యం, పోషణ, విద్యపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. పిల్లలందరూ సంతోషంగా గడుపుతూ, ఉపాధ్యాయుల ఆశీర్వాదాలు పొందాలన్నారు.