సిపిఐ, ప్రజా సంఘాల సభ్యత్వ సేకరణ ప్రారంభం
సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధనుంజయ నాయుడు.
నేరేడుచర్ల, నవంబర్14(విజయక్రాంతి): సిపిఐ పార్టీ(CPI Party) మరియు ప్రజా సంఘాల సభ్యత్వాన్ని సూర్యాపేట జిల్లా(Suryapet district) నేరేడుచర్ల లో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనుంజయ నాయుడు(Dhulipala Dhanunjaya Naidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ పార్టీకి(CPI Party) పూర్వవైభవం వస్తున్నదని అందులో భాగంగా ఒక శాస్త్ర సభ్యుడు ఒక శాసనమండలి సభ్యులతో పాటు ఒక మేయర్ పదవి కూడా సిపిఐ కైవసం చేసుకున్నదని సింగరేణి ఎన్నికలతో(Singareni Election) పాటు ఇటీవల జరిగిన ఆర్టీసీ ఎన్నికల్లో(RTC Election) కూడా ఏఐటీయూసీ కాంగ్రెస్ పార్టీ(AITUC Congress Party) అనుబంధ సంఘాల పైన ఘనవిజయo సాధించిందని అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కే శ్రీనివాసరెడ్డిని రెండుసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయడం స్వాగతిస్తున్నామని
భవిష్యత్తులో మరింత ఎక్కువ సంఖ్యలో ప్రజా ప్రతినిధులుగా సిపిఐ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా గౌరవప్రదమైన స్థానాలు సంపాదించామని ముఖ్యంగా ఎవరితో పొత్తు పెట్టుకోకుండా కొత్తగూడెం మేయరు గెలవడం సిపిఐ చరిత్రలో ఒక కీలకమైన మైలురాయి లాంటిదని నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజల కొరకు ప్రజా సమస్యలపై మడమ తిప్పని పోరాటాలు నిర్వహించడం వల్లనే ఇవి సాధ్యమయ్యాయని మారుతున్న కాలంతో పాటు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాలను రూపొందించుకొని ఉద్యమాలు నిర్వహిస్తామని
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మిత్రపక్షo అని కూడా చూడబోమని మేము ఎప్పుడూ కూడా ప్రజల పక్షమే అని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను ఏఐటీయూసీ ప్రాంతీయ సహాయ కార్యదర్శి ముత్యాల భాస్కర్ సిపిఐ సీనియర్ నాయకులు బెల్లంకొండ గోవిందు గౌడ్ , ఏఐవైఎఫ్ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పరికె భరత్ పాల్గొన్నారు.