తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జి

14-11-2026 | 07:25pm

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌(Telangana Congress)లో కీలక సంస్థాగత మార్పు చోటుచేసుకున్నట్లు సమాచారం. రాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే ఏఐసీసీ ఇన్‌ఛార్జి బాధ్యతల్లో మార్పు జరిగినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు ఈ బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్(Mallikarjun Kharge) స్థానంలో బీఎం సందీప్‌(BM Sandeep)ను నియమించినట్లు సమాచారం. ఈ నియామకానికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Congress National President Mallikarjun Kharge) ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లనున్న నేపథ్యంలో కొత్త ఇన్‌ఛార్జి నియామకంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆమె స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే అంశంపై కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

కొత్త బాధ్యతల కోసం రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్, మణిక్ రావు థాక్రే తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. చివరకు బీఎం సందీప్ పేరు తెరపైకి వచ్చినట్లు సమాచారం. ఈ మార్పుతో తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు, పార్టీ నాయకత్వంతో సమన్వయం వంటి అంశాల్లో కొత్త ఇన్‌ఛార్జి కీలక పాత్ర పోషించనున్నారు.

మరిన్ని వార్తలు