ఎంపీ కి ఆదివాసీ గ్రామస్థుల వినతి
ఆదిలాబాద్, నవంబర్ 17, (విజయక్రాంతి) : గాదిగూడ మండలంలోని చిత్తగూడ నుంచి ధనుగూడ గ్రామం(Dhanuguda villagers) వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే నిధులు మంజూరు(Funds sanctioned) అయిన పనులు ప్రారంభం కాలేదని ధనుగూడ గ్రామస్థులు పేర్కొన్నారు.
మంగళవారం ఆదిలాబాద్ లో ఎంపీ గోడం నగేష్ ను తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు పెందోర్ దాదా రావు ఆధ్వర్యంలో తమ సమస్య పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. రోడ్డు, వంతెన నిర్మాణం పూర్తయితే ధనుగూడ గ్రామ ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగుతాయన్నారు. దీనిపై స్పందించిన ఎంపీ తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని గ్రామస్థులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మిత్ర జిల్లా కోర్డినేటర్ పెందోర్ వినోద్ కుమర్, ఉప సర్పంచ్ కనక గంగారాం భాబేజారి, పెందోర్ జాకెష్, పెందోర్ క్రిష్ణ, పెందోర్ మోహన్, జూజ్ఞాక యశ్వంత్ తదితరులు ఉన్నారు.