ఉద్యోగులకు స్పోర్ట్స్ మెటీరియల్ ఏర్పాటు చేయాలి
సత్తుపల్లి. నవంబర్ 17. ( విజయక్రాంతి): సత్తుపల్లి ఏరియా(Sattupalli Area) ఉద్యోగులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మెటీరియల్(Sports and Games Equipment) ఏర్పాటు చేయాలని ఏరియా జనరల్ మేనేజర్ వెంకటాచారి ని కలిసిన ఐఎన్టీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి(Deputy General Secretary of INTUC) తీగల క్రాంతి కుమార్.
తీగల క్రాంతికుమార్ మాట్లాడుతూ సింగరేణి సంస్థ వార్షికోత్పత్తి లక్ష్యం లో సత్తుపల్లి ఏరియా నుండి అత్యధికంగా బొగ్గు ఉత్పత్తి రవాణా సాధించుటకు కృషి చేస్తున్న ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కృషి చేయాలని కోరుతూ పి.వి.ఎన్ కాలనీ ఇండోర్ స్టేడియంలో అవసరమైన క్రీడా సామాగ్రి ఏర్పాటు మరియు ఏరియా పరిధిలో నిర్వహించే స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మెటీరియల్ క్రికెట్ కిట్లు ,
వాలీబాల్ కిట్లు , షటిల్ బ్యాట్లు నెట్ , బ్యాట్మెంటన్ కిట్లు , ఫుట్ బాల్ కిట్లతో పాటు ఇతర ఇండోర్ అవుట్ డోర్ క్రీడా సామాగ్రి ఏర్పాటు చేసి ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం పూర్తి చేయాలని కోరారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో కొనుగోలు చేసిన స్పోర్ట్స్ మెటీరియల్ సత్తుపల్లి కి కేటాయించాలని జనరల్ మేనేజర్ వెంకటాచారి ని కోరారు.జి.యం సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు పంపించి ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి యాజమాన్యం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు అని తెలియజేశారు.