అభివృద్ధి పనులకు శంకుస్థాపన

17-11-2026 | 02:31pm

కాలనీల్లో సీసీ రోడ్లు, బాక్స్ డ్రైన్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

ఉప్పల్ నవంబర్ 17విజయక్రాంతి: మల్లాపూర్ డివిజన్(Mallapur Division) పరిధిలోని వివిధ కాలనీల్లో మొత్తం రూ.2.23 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Laxma Reddy), మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా బ్రహ్మపురి కాలనీలో రూ.26 లక్షలతో, సూర్యనగర్ కాలనీలో రూ.27.50 లక్షలతో, శక్తి సాయినగర్ కాలనీలో రూ.33.50 లక్షలతో, దత్తాత్రేయ నగర్ కాలనీలో రూ.24.50 లక్షలతో, గోకుల్ నగర్ కాలనీలో రూ.27 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మల్లికార్జున్ నగర్ కాలనీలో రూ.85 లక్షలతో చేపట్టనున్న బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజలకు మెరుగైన రహదారులు, డ్రైనేజీ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు, నాయకులు, ఎంఎంసీ నాచారం సర్కిల్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, చారితో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు