వ్యవసాయ డ్రోన్ శిక్షణ

14-11-2026 | 06:55pm

భద్రాచలం, ఇల్లందు, అశ్వారావుపేటలో ప్రారంభం

ఐటీడీఏ పీవో బి రాహుల్

అశ్వారావుపేట (విజయక్రాంతి): రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని(Modern technology) అందించడంలో భాగంగా యూత్ ట్రైనింగ్ సెంటర్ (YTC), భద్రాచలం, ఇల్లందు, అశ్వరావుపేట లలో వ్యవసాయ డ్రోన్ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతోందని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ శనివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

వ్యవసాయంలో డ్రోన్ల ఉపయోగాలు

పంటలకు పురుగుమందులు, ఎరువులను వేగంగా పిచికారీ చేయవచ్చు,నీరు మరియు మందుల వినియోగాన్ని  తగించుకోవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేయవచ్చు. రైతులకు శ్రమ, సమయం మరియు ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది.

పురుగుమందుల ప్రత్యక్ష సంబంధాన్ని తగ్గించి రైతుల ఆరోగ్య భద్రతకు తోడ్పడుతుంది. ఆధునిక డ్రోన్ టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని మరింత సులభతరం చేయవచ్చు.

*డ్రోన్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న యువతీ యువకులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనడానికి తమ పేర్లను నమోదు  చేసుకోగలరని కోరారు.

మరిన్ని వివరాలకు ఈ  సెల్ నెంబర్ లో 9441390232 లో సంప్రదించాలని కోరారు.

మరిన్ని వార్తలు