అప్పు తీర్చలేదని పసికందును లాక్కెళ్లిన వడ్డీ వ్యాపారులు
తిరుపతి: తిరుపతి(Tirupati) జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటుచేసుకుంది. తొట్టంబేడు మండలం శివనాథపాలెం గ్రామానికి చెందని ఆది, మేఘమాల దంపతులు ఏడు నెలల క్రితం శ్రీకాళహస్తి(Srikalahasti)కి చెందిన వెంకటగిరి మునెమ్మ, ప్రసాద్, మోహన్ కుటుంబ సభ్యుల వద్ద రూ.1.5 లక్షలు అప్పు(Debt)గా తీసుకున్నారు. దీనికి ఐదు రూపాయల వడ్డీ చెల్లించేలా ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో వడ్డీ వ్యాపారులు తల్లిని, ఆరు నెలల పసికందును బలవంతంగా తీసుకెళ్లారు.
తల్లి, బిడ్డను తీసుకెళ్లడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. పోలీసుల జోక్యంతో తల్లిని, చిన్నారిని తిరిగి కుటుంబసభ్యలకు అప్పగించారు. అప్పు వసూలు పేరుతో పసికందును తీసుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.