బ్రిలియంట్లో బాలల దినోత్సవ సందడి
విద్యార్థుల ప్రతిభకు ప్రతిభా పరీక్షలు.. విజేతలకు బహుమతులు
బూర్గంపాడు,(విజయక్రాంతి): సారపాకలోని బ్రిలియంట్ విద్యాసంస్థల్లో(Brilliant Educational Institutions) బాలల దినోత్సవ వేడుకలు(Children's Day Celebrations) శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మండలస్థాయి ప్రతిభా పరీక్షలకు(Mandal level talent tests) వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. పరీక్షలతోపాటు(Examinations) నిర్వహించిన ఆటల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సారపాక ఉపసర్పంచ్ రమేష్ తొలుత చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతోపాటు వివిధ రంగాల్లోనూ రాణించాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని తల్లిదండ్రులకు, దేశానికి పేరు తీసుకురావాలన్నారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు, పాటలు, నాటికలు అలరించాయి. మండలస్థాయి ప్రతిభా పరీక్షలు, ఆటల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సొలేషన్ బహుమతులను అతిథులు అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.