గోశాలల అభివృద్ధికి తోడ్పడాలి

15-11-2026 | 06:31pm

జగిత్యాల, నవంబర్ 15 ( విజయక్రాంతి ) : గోసంతతిని రక్షించేందుకు గోశాలల అభివృద్ధికి(Development of Cow Shelters) ప్రతి ఒక్కరూ తోడ్పడాలని గ్రామ వికాస్ తెలంగాణ ప్రాంత సంయోజక్ జిన్న సత్యనారాయణ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కరీంనగర్ విభాగ్ సంఘచాలక్ డాక్టర్ భీమనాతిని శంకర్ లు పిలుపునిచ్చారు. జగిత్యాల(Jagtial) మండలం తాటిపెల్లి సురభి గోశాల ఆధ్వర్యంలో సుమారు 30 ఎకరాల స్థలంలో అభివృద్ధి పరచనున్న "గోఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని" ఆదివారం ప్రారంభించారు.

హైదరాబాద్ కు చెందిన పలువురు పారిశ్రామికవేత్తలు(Industrialists), దాతల సహకారంతో తాటిపెల్లి గ్రామ(Tatipelli village) శివారులో ఏర్పాటు చేసిన గోశాల ద్వారా గోఆదారిత ప్రకృతి వ్యవసాయాన్ని అభివృద్ధి పరిచేందుకు భూమి పూజ చేశారు. ఈ వ్యవసాయ క్షేత్రంలో పట్టు పురుగుల పెంపకం, కూరగాయల సాగు తో పాటు పంచగవ్యం, గోఅర్క, తదితర మందులను తయారు చేసేందుకు నిర్ణయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా సోలార్ ఫెన్సింగ్, డ్రిప్ ఇరిగేషన్, గోదాముల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భారత దేశ సంస్కృతికి, ఆర్థిక అభివృద్ధికి మూలాధారం గోసంతతి అని అన్నారు. అనాది కాలం నుండి గోమాతను పూజించడమే కాకుండా ప్రతి కుటుంబంలో గోవులను పెంచడం ద్వారా ఆరోగ్య పరిరక్షణ, ఆర్థిక అభివృద్ధి సాధించడం జరిగిందన్నారు. "ప్రతి ఇంటికి ఒక గోవు ప్రతి ఊరికి ఒక గోశాల" అనే నినాదంతో ముందుకు వెళ్లి గోసంతతిని రక్షించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం దెబ్బ తినడమే కాకుండా ఆహార పదార్థాలు విషతుల్యంగా మారి ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సురభి గోశాల అధ్యక్షులు డాక్టర్ తురగ రాజిరెడ్డి, కార్యదర్శి కమలాకర్ రావు, జనార్దన్ రావు, రాజేశ్వర్, రాజేందర్, రవి, అశోకరావు

మరిన్ని వార్తలు