మాజీ సర్పంచ్ కు పరామర్శ

15-11-2026 | 06:31pm

ములకలపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): మండలంలోని కమలాపురం గ్రామపంచాయతీ(Kamalapuram Grama Panchayat) మాజీ సర్పంచ్, మండల సర్పంచుల సంఘం సహాయ కార్యదర్శి గొల్ల పెంటయ్యను ఆదివారం మండలంలోని మాజీ సర్పంచులు పరామర్శించారు. ఇటీవల ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో గుండెకు సంబంధించినటువంటి వ్యాధితో బాధపడుతూ గుండెకు స్టంట్ వేయించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న ఆయనను పరామర్శించి ఆరోగ్య స్థితిగతులు తెలుసుకున్నారు. ఆయనను పరామర్శించిన వారిలో మాజీ సర్పంచులు, మండల మాజీ సర్పంచుల సంఘం అధ్యక్షులు బైటి రాజేష్, మండల మాజీ ప్రధాన కార్యదర్శి వాడే నాగరాజు, మాజీ సర్పంచులు కీసరి శ్రీనివాస్, సున్నం సుధాకర్ ఉన్నారు.

మరిన్ని వార్తలు