మునగాల జడ్పీ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

15-11-2026 | 06:33pm

కోదాడ (మునగాల)నవంబర్ 15(విజయ క్రాంతి): మునగాల మండల(Munagala Mandal) కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో(ZPHS School) 2007-08 బ్యాచ్ కు చెందిన 10వ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం(Alumni Reunion) ఆదివారం ఘనంగా జరిగింది. ఎన్నో సంవత్సరాల తర్వాత తాము చదువుకున్న పాఠశాల ప్రాంగణంలో ఒకరినొకరు కలుసుకొని పలకరించుకున్నారు. ఈ సందర్భంగా అప్పటి ఉపాధ్యాయులను పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు తమ పాఠశాల మధుర జ్ఞాపకాలను నెమర వేసుకున్నారు.

విద్యార్థి దశలో ఎదురైన అనుభవాలు, స్నేహబంధాలు, అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. అనంతరం నృత్యాలు, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో అప్పటి ప్రధానోపాధ్యాయులు బుచ్చిరెడ్డి, శ్రీనివాస్, మధుసూదన్, కృష్ణయ్య, రామిరెడ్డి,బ్రహ్మానందం, మౌలానా, విద్యార్ధులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు