ఘనంగా మున్నూరు కాపుల కార్తీక వన సమారాధన మహోత్సవం

29-11-2026 | 08:03pm

సమాజాభివృద్ధిలో మున్నూరు కాపులు ఆదర్శంగా నిలవాలి 

కార్యక్రమంలో వక్తలు

లక్ష్మిదేవిపల్లి నవంబర్ 29, (విజయక్రాంతి): మున్నూరు కాపు కార్తీక మాస వన సమారాధన మహోత్సవం ఆదివారం లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని సెంట్రల్ పార్క్ నర్సరీ(Central Park Nursery) ప్రాంగణంలో ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి కొత్తగూడెం, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండలంలోని నలుమూలల నుంచి మున్నూరు కాపూ కుంటుంబ సభ్యులతో భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు కార్తీక దీపోత్సవం, గోపూజతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అల్పాహారం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

సంఘం అధ్యక్షులు, ముఖ్య అతిథులు మాట్లాడుతూ మున్నూరు కాపుల ఐక్యత, ఆప్యాయతలను కొనియాడారు. కుల బాంధవులందరూ ఒకే వేదికపై కలవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. మధ్యాహ్నం  సామూహిక వనభోజనాలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. 

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ మాజీ హెల్త్ డైరెక్టర్, జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ గడల శ్రీనివాసరావు, భీమా శ్రీధర్, నాయకులు ఎడవెల్లి కృష్ణ వనమా రాఘవేంద్రరావు, రామచెట్టి సురేష్, అధ్యక్ష కార్యదర్శులు హనుమంతరావు గోపాలకృష్ణర్లు, కొత్వాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు