వైభవంగా మహా గణనాథుని ఆలయ ప్రథమ వార్షికోత్సవం

29-11-2026 | 08:35pm

ఎల్బీనగర్, నవంబర్ 29: హయత్ నగర్ డివిజన్(Hayath Nagar Division) పరిధిలోని మహా గాయత్రీ కాలనీలో  నిర్మించిన శ్రీ మహా గణనాథుని ఆలయ ప్రథమ వార్షికోత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు.  ప్రత్యేక పూజా కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. మహా గణనాథుని దర్శించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో శ్రీ మహాగాయత్రి కాలనీ అధ్యక్షుడు దేవ్ సింగ్, ప్రధాన కార్యదర్శి కాసుల కృష్ణ,  కోశాధికారి ప్రవీణ్ రెడ్డి, సతీష్ కుమార్, ఆచార్య, చిన్నకోటయ్య, వేణుగోపాల్ రెడ్డి, సోమయాచారి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు