దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
గండీడ్, నవంబర్ 29, (విజయక్రాంతి): పరిగిలోని శారదా గార్డెన్లో నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి(Former MLA Koppula Mahesh Reddy) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో దీక్షా దివస్ ప్రాముఖ్యత, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన దీక్ష గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి గండీడ్ మండల నాయకులు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ అధ్యక్షుడు పెంట్యా నాయక్, జిన్నారం గోపాల్, ఈశ్వరయ్య,ఎల్గరి రాంరెడ్డి, బూదేవి,చెన్నయ్య, ఆంజనేయులు, ఉప సర్పంచులు భీమయ్య, రవికాంత్ రెడ్డి,రాములు, సురేష్, నీలేష్, కిష్టయ్య, వెంకట్ రాములు, వెంకట్ రెడ్డి,బోయిని శ్రీనివాస్, రెడ్డిపల్లి బోడి వెంకటయ్య,రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.