నగదు చోరీ కేసులో ముమ్మర దర్యాప్తు

29-11-2026 | 08:28pm

- ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ 

- ముసుగు ధరించి రూ. 3.20 కోట్ల నగదు చోరీ 

ఎల్బీనగర్, నవంబర్ 29: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ కేసు(Robbery Case)ను పోలీసులు సవాల్ గా స్వీకరించారు. మన్సూరాబాద్ డివిజన్ లోని చందేశ్వర్ కాలనీలో శనివారం ఒక ఇంట్లోకి ముసుగు ధరించిన నలుగురు దుండగులు వచ్చి, మహిళల చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి, బెడ్‌రూమ్‌లోని బీరువాను పగలగొట్టి, అందులో ఉన్న రూ.3.20 కోట్ల నగదు మొత్తాన్ని తీసుకుని పరారయ్యారు.

ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి ఎల్బీనగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితులను పట్టుకోవడానికి మొత్తం పది పోలీసు బృందాలను నియమించినట్లు సీఐ వెంకటేశం తెలిపారు. ఇప్పటికే కాలనీలో ఉన్న సుమారు 50 సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తూ నిందితులను త్వరలో పట్టుకుంటామని సీఐ వెంకటేశం తెలిపారు.

మరిన్ని వార్తలు