కామారెడ్డిలో 108 సామూహిక యజ్ఞ కుండలి
29-11-2026 | 09:04pm
కోటి దీపోత్సవం
కామారెడ్డి, నవంబర్ 29 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) కేంద్రంలో ఆదివారం లోక కళ్యాణార్థం సామూహిక యజ్ఞ కుండలి కార్యక్రమాలను 108 జంటలతో నిర్వహించారు. 108 యజ్ఞ కుండలిలను ఏర్పాటు చేసి సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జంటలు పాల్గొని యజ్ఞ కుండలి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కోటి దీపోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గుడిమెట్ స్వామీజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.