జ్ఞాన కేంద్రంలో ఘనంగా 44వ జ్ఞానమాల కార్యక్రమం

29-11-2026 | 08:24pm

మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలే సమాజ మార్పునకు మార్గదర్శకం

జవహర్ నగర్, నవంబర్ 29,(విజయక్రాంతి): సమాజంలో కుల వివక్ష, అంటరానితనం, అసమానతలు రాజ్యమేలుతున్న రోజుల్లో వాటికి వ్యతిరేకంగా పోరాడి, విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి వుల్లి సురేష్ ముదిరాజ్(Suresh Mudiraj) కొనియాడారు.

కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ డివిజన్ రాజీవ్ గృహకల్ప కాలనీలోని జ్ఞాన కేంద్రం ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో 44వ జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌడ సంఘం కార్యదర్శి గంధమాల ఉపేందర్ గౌడ్ మహనీయులు డా.బి ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

మరిన్ని వార్తలు