దీక్షా దివస్ సందర్భంగా 'జక్కిడి' ట్రస్టు సేవా కార్యక్రమాలు

29-11-2026 | 08:33pm

ఎల్బీనగర్, నవంబర్ 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత చేపట్టిన చారిత్రాత్మక నిరాహార దీక్షను స్మరించుకుంటూ ఆదివారం దీక్షా దివస్(Deeksha Divas) నిర్వహించారు. బీఆర్ఎస్ మన్సూరాబాద్ డివిజన్ అధ్యక్షులు జక్కిడి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామ్ నగర్ కాలనీ చౌరస్తాలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించి, కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మ చేయూత ఫౌండేషన్ లో నివసిస్తున్న దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాలలో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి, జక్కిడి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ జక్కిడి రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు