శ్రమకు తగ్గ ప్రతిఫలం చెల్లించాలి

15-11-2026 | 08:06pm

సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలు సరికాదు

20 శాతం బోనస్, కనీస వేతనాలు చెల్లించాలి 

ఓబీ కార్మికుల సమ్మెపై సింగరేణి, లేబర్ శాఖ జోక్యం చేసుకోవాలి

సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాష.

కొత్తగూడెం: టౌన్ నవంబర్ 15 (విజయక్రాంతి) : కష్టపడి పనిచేసే కార్మికుల శ్రమకు(Labor of workers) తగ్గ ప్రతిఫలం చెల్లించాలని, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి(CPI District Secretary) ఎస్.కె. సాబీర్ పాషా డిమాండ్ చేశారు. సింగరేణి కొత్తగూడెం ఏరియా(Singareni Kothagudem Area) పరిధిలోని వెంకటేష్ ఖని కోల్‌మైన్(Venkatesh Khani Coal Mine) (వీకేసీఎం) ఓపెన్‌కాస్ట్‌లో(Opencast) ఓవర్‌బర్డెన్ (మట్టి పని) తీసే కాంట్రాక్ట్ కార్మికులు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షా శిబిరాన్ని ఆదివారం ఆయన సందర్శించి సంపూర్ణ సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ, కార్మికులకు రావాల్సిన 20 శాతం బోనస్ చెల్లించాలని, ఇతర ఓబీ కంపెనీల తరహాలో రోజుకు రూ.950 చొప్పున 26 రోజుల వేతనం, ఆదివారం డబుల్ మస్టర్, చట్టబద్ధ హక్కులు కల్పించాలని కోరారు. సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం మొండిగా వ్యవహరించడం తగదని, సమ్మెను విచ్ఛిన్నం చేసే చర్యలకు పాల్పడటం సరైనది కాదని హితవు పలికారు, సమ్మె చేస్తున్నారని కారణంతో నలుగురు కార్మికులను విధుల నుంచి తొలగించడం చట్ట విరుద్ధమని ఇలాంటి చర్యలు  యాజమాన్యం మానుకోవాలని డిమాండ్ చేశారు.

తక్షణమే సింగరేణి యాజమాన్యం, లేబర్ శాఖ చొరవ తీసుకుని కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్మికుల న్యాయపోరాటానికి సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్  మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, జీ వీరస్వామి, గట్టయ్య, మార్షల్ శ్రీను, మోహన్, సత్తార్, కట్టా ఉదయ్, జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు