పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

15-11-2026 | 07:57pm

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు 

జుక్కల్, నవంబర్ 15 (విజయక్రాంతి) : జుక్కల్ నియోజకవర్గం(Jukkal Constituency) మద్నూర్, డోంగ్లీ, మొహమ్మద్ నగర్, నిజాంసాగర్ మండల కేంద్రాల్లో అర్హులైన లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల('Cheyutha' pensions) మంజూరు పత్రాలు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

గత బిఆర్ఎస్ పాలనలో అనర్హులకు సైతం పింఛన్లు అందాయి, కానీ నేడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు