కలెక్టర్ పేరుతో నకిలీ సందేశాలు
15-11-2026 | 08:03pm
భూపాలపల్లి, నవంబర్ 15 (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) పేరు, ఫొటోను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లు నకిలీ సామాజిక మాధ్యమ, వాట్సాప్ ఖాతాల ద్వారా డబ్బులు పంపాలని సందేశాలు పంపుతున్నారని కలెక్టర్ తెలిపారు. 97398 11309 నంబర్ నుంచి ఇలాంటి సందేశాలు వస్తున్నాయని, ఎవరూ స్పందించవద్దని, డబ్బులు పంపవద్దని సూచించారు. అనుమానాస్పద నంబర్లను వెంటనే నిలిపివేసి, సైబర్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు సూచించారు.