కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడికి గాయాలు

15-11-2026 | 07:35pm

కేసు నమోదు

ఘట్ కేసర్, నవంబర్ 15 (విజయక్రాంతి): కారు ఢీకొట్టడంతో మూడేళ్ల బాలుడికి గాయాలైన సంఘటన ఘట్కేసర్ పోలీస్ స్టేషన్(Ghatkesar Police Station) పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తేదీ 15.11.2026 ఆదివారం ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో అంకుషాపూర్ గ్రామానికి చెందిన కాసుల సంపత్(33) తన హీటర్‌ను రిపేర్ చేయించుకోవడానికి ఘట్‌కేసర్ మసీదు సమీపంలోని ఒక ఎలక్ట్రానిక్స్ దుకాణానికి వెళ్లారు. అదే సమయంలో, ఆయన బావమరిది తన మూడేళ్ల కవల కుమారులు ఉద్దిరన్, ఉజ్జయిన్‌లను కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం రోడ్డుకు అవతలి వైపుకు తీసుకెళ్లారు.

తిరిగి వస్తున్న క్రమంలో మూడేళ్ల బాలుడు ఉజ్జయిన్ రోడ్డు దాటుతుండగా ఘట్‌కేసర్ పోస్ట్ ఆఫీస్ వైపు నుండి మెయిన్ రోడ్డు వైపుకు వస్తున్న మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు (నెం. TG15BA0593) డ్రైవర్ వాహనాన్ని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ బాలుడిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బాలుడు ఎగిరి కిందపడటంతో తలకు, చెవిలోపల తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు కుటుంబ సభ్యులు గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం ఘట్‌కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి  తదుపరి మెరుగైన వైద్యం కోసం అపెక్స్ ఆసుపత్రి కి తరలించారు. ప్రస్తుతం బాలుడు అక్కడ చికిత్స పొందుతున్నాడు. బాధితుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు