చిమ్మని చీకట్లో గోపాల్పేట్ ఆర్టీసీ బస్టాండ్
నాగిరెడ్డిపేట్, నవంబర్ 15 (విజయక్రాంతి): మండలంలోని గోపాల్పేట్ ఆర్టీసీ బస్టాండ్(Gopalpet RTC Bus Stand) ప్రాంగణంలో విద్యుత్ దీపాలు లేక చిమ్మని చీకట్లో బస్టాండ్ దర్శనమిస్తుంది. ప్రయాణికులు బస్సుల కోసం చిమ్మని చీకట్లో వేచి చూస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు కొంతమేర నిధులు తెచ్చి పునర్నిర్మానం చేపట్టారు. కానీ ఆర్టీసీ బస్టాండ్‌లో విద్యుత్ దీపాలు లేక చిమ్మని చీకట్లో దర్శనమిస్తుంది.
చిమ్మని చీకట్లో ప్రయాణికులు బస్సుల కోసం ఎదురుచూస్తూ ఉండడంతో ఏదైనా చీడ పురుగులు తిరిగే ఆస్కారం ఉందని ఆందోళన చెందుతున్నారు. దాంతో పాటు బస్టాండ్ ప్రాంగణంలో మరుగుదొడ్లు ఎలాంటి నీటి సౌకర్యం,వర్కర్లు లేక ప్రయాణికులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఆర్టీసీ అధికారులు స్పందించి బస్టాండ్ ప్రాంగణంలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని అలాగే నీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేపట్టినప్పటికీ అధికారులు ఆ పనులను సరైన పద్ధతిలో నడిపించకపోవడంలో ప్రభుత్వం విప్లమవుతుందని ప్రయాణికులు ప్రజలు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఎన్నో పనులు చేపట్టినప్పటికీ అధికారులు సరిగ్గా లేకపోతే ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతున్నాయని ప్రజలు ప్రయాణికులు మండిపడుతున్నారు.ఎమ్మెల్యే ఆర్టీసీ బస్టాండ్‌ను నిర్మాణం చేపట్టినప్పటికీ బస్టాండ్‌లో ఏలాంటి సౌకర్యాలు లేకపోవడమే ఇది ఉదాహరణగా చెప్పవచ్చు.వెంటనే అధికారులు స్పందించి గోపాల్పేట్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో విద్యుత్ దీపాలను సరైన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు ప్రజలు కోరుతున్నారు.