సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్ చెరు

15-11-2026 | 08:11pm

భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా ఛట్ పూజా వేడుకలు

ఉత్తర భారతీయుల సంక్షేమానికి ప్రత్యేక కృషి

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, నవంబర్ 15: సబ్బండ వర్గాల సంస్కృతి, సంప్రదాయాలకు(Culture and traditions) పటాన్ చెరు నిలయంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) అన్నారు. ఆదివారం పటాన్చెరు సాకి చెరువు వేదికగా ఛట్ పూజా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మైత్రి మైదానంలో నిర్వహించిన సంగీత విభావరిలో ప్రముఖ భోజ్‌పురి గాయకుడు రితేష్ పాండే, గాయని కావ్య తమ పాటలతో అలరించారు. వేలాదిగా తరలివచ్చిన ఉత్తర భారతీయులు జై ఛట్టి మయ్య నినాదాలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాంతం, భాష, కులం, మతం అనే భేదాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను గౌరవించడం తెలంగాణ గొప్ప సంస్కారమని అన్నారు. ఉపాధి, వ్యాపారాల కోసం పటాన్చెరులో స్థిరపడిన ఉత్తర భారతీయులు ఈ ప్రాంత అభివృద్ధిలో కీలక భాగస్వాములని పేర్కొన్నారు. వారి సంక్షేమం, అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా పటాన్చెరులో ఛట్ పూజా వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఉత్తర భారతీయుల సంక్షేమ సంఘం ప్రతినిధులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు