అట్టహాసంగా ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్
బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న బెల్లంపల్లి ఛాంపియన్స్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్(Champions Trophy Cricket Tournament) అట్టహాసంగా ప్రారంభోత్సవవం జరిగింది. ఈ టోర్నమెంట్ కు ముఖ్య అతిథులుగా టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ నాతరి స్వామి, బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ఐ రామకృష్ణ, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు రాయలింగు హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యువత చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ టోర్నమెంట్లో వివిధ మండలాలకు చెందిన క్రికెట్ జట్లు పాల్గొనీ తమ ప్రతిభను చాటుకోనున్నాయి. యువ క్రికెటర్లలో ఉన్న ప్రతిభను వెలికితీయడంతో పాటు గ్రామీణ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించడమే ఈ టోర్నమెంట్ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులు వంశీ, సాయిరాం, అనీష్, తహర్ తదితరులు పాల్గొన్నారు.