మండలంలో బీజేపీ బలోపేతానికి నూతన కార్యవర్గం కృషి చేయాలి
విజయ్ కుమార్ రెడ్డి
గండీడ్,నవంబర్ 15:విజయక్రాంతి: మండల భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) నూతన కార్యవర్గం నియామకమైన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు విజయ్ కుమార్ రెడ్డి(Vijay Kumar Reddy), శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు నూతన కార్యవర్గ సభ్యులంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామాల అభివృద్ధి, ప్రజా సంక్షేమం,దేశసేవే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన కార్యవర్గం వివరాలు:
ఉపాధ్యక్షులు: కావలి నర్సింహులు, సంతెం వెంకటేష్, చాకలి బాలయ్య, ఎం.గణేష్ గౌడ్.
ప్రధాన కార్యదర్శులు: భద్రేశ్వర్,ఛత్రపతి శ్రీనివాస్.
కార్యదర్శులు: కాకి నరేష్, పి.వెంకట్ రెడ్డి, బంటు కృష్ణ, కమ్మరి నర్సింలు, అముక కృష్ణ, మోత్కు సునీత రామిరెడ్డి.
కోశాధికారి: పల్లవత్ సంతోష్.
మహిళా మోర్చా: రాజేశ్వరి.
యువ మోర్చా: పుల్లారి నవీన్ యాదవ్.
కిసాన్ మోర్చా: అన్నారం కిష్టారెడ్డి.
ఎస్సీ మోర్చా: దొడ్య రాములు.తదితరులు పాల్గొన్నారు.