పేకాట రాయుళ్ల అరెస్ట్
కరీంనగర్ క్రైం, నవంబర్ 15(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్(Karimnagar Rural Police Station) బొమ్మకల్ బైపాస్ రోడ్డులో పేకాట స్థావరంపై(Poker base) పోలీసుల దాడులు(Police raids) నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న(playing cards) ఆరుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడినవారిలో బావు శ్రీశైలం, మహమ్మద్ మొహినొద్దీన్, మహమ్మద్ సాజిద్, మహమ్మద్ అజీమొద్దీన్, మహమ్మద్ పాషా, మహమ్మద్ షరీఫ్ లు ఉన్నారు. వారి వద్ద నుండి రూ.15,730 నగదు, 52 పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడినవారిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఇన్స్పెక్టర్ నిరంజన్ రెడ్డి తెలిపారు.