తంగళ్లపల్లిలో టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు..
తంగళ్ళపల్లి నవంబర్ 15 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) తంగళ్లపల్లి మండలంలోని టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో ఆదివారం భారీగా పార్టీ చేరికలు జరిగాయి. తంగళ్లపల్లి టీఆర్ఎస్ మండల ఇన్చార్జ్ గౌరు రాజశేఖర్, మహిళా నాయకులు ఆంకారం పద్మ, కొలనూరి లింగవ్వ, గుడిసెల సుజాత ఆధ్వర్యంలో సుమారు 200 మంది తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు సుమలత, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ మజీద్ ముఖ్య అతిథులుగా హాజరై నూతనంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అధినేత్రి కవితక్క ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న పోరాటాలకు రాష్ట్ర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. కవితక్క ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని, యువత, నిరుద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు సైతం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు సాదిక్, నియోజకవర్గ యువ నాయకుడు సయ్యద్ జావిద్, బందెల రాజు, మహిళా నాయకురాలు చెరుకుపల్లి శైలజ, కదిరే రేణుక, గౌరు రమ్య, అల్లె శంకర్, చిన్ని బాల్ రెడ్డి, దేవదాసు, నందిని, షబానా, కుసుమ విష్ణు, మేడుదుల శేఖర్, రాఖేశ్, అస్లాం, ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షుడు కదిరే భాస్కర్, మైనార్టీ అధ్యక్షుడు హాజీ బాబా తదితరులు పాల్గొన్నారు.