ప్లాస్టిక్ నిర్మూలనకు గ్రామస్తుల ప్రతిజ్ఞ

15-11-2026 | 06:36pm

లక్ష్మీపూర్‌లో ప్లాస్టిక్ భూతం దహనం.. వస్త్ర సంచుల పంపిణీ

జగిత్యాల, నవంబర్ 15 ( విజయక్రాంతి): జగిత్యాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల(Government Junior College for Girls, Jagtial) ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్(NSS Unit) ఆధ్వర్యంలో లక్ష్మీపూర్ గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక శీతాకాల శిబిరంలో భాగంగా ఆదివారం ప్లాస్టిక్ నిర్మూలనపై(Elimination of Plastic) పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లు ప్లకార్డులు(NSS volunteers with placards) చేతబూని గ్రామంలోని ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం(Plastic usage) వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ గ్రామస్తులను చైతన్యపరిచే నినాదాలు చేశారు. అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు(Members of the Gram Panchayat governing body) గ్రామ చౌరస్తాలో ప్లాస్టిక్ భూతం దిష్టిబొమ్మను దహనం చేశారు.

గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో స్థానికులకు వస్త్ర సంచులను పంపిణీ చేశారు. ఇకపై గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని గ్రామస్తులు సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు.మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో సీనియర్ వాలంటీర్, సర్పంచుల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు గడ్డం జీవన్ రెడ్డి పాల్గొని నాయకత్వ లక్షణాలు, లక్ష్య సాధన అంశాలపై ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్లకు అవగాహన కల్పించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్ల కవిత స్వామిరెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రామ్ ఆఫీసర్ కొట్టాల తిరుపతిరెడ్డి, ఉపసర్పంచ్ ఎడమల సత్తిరెడ్డి, ప్లాస్టిక్ నిర్మూలన ఉద్యమకర్త నాగిరెడ్డి మధుసూదనరెడ్డి, అధ్యాపకులు సునీత, నర్సయ్యతో పాటు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు