మేయర్ కి మెమొరండం ఇచ్చిన కార్పొరేటర్ హిమశ్రీ

07-11-2026 | 11:32pm

అంగన్వాడికి సొంత భవనాలు నిర్మించాలి

కొత్తగూడెం,(విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్(Kothagudem Corporation) కార్యాలయములో కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం(Corporation Council Meeting)లో 18 వ డివిజన్లో 4 అంగనవార్డు సెంటర్లు నిర్వహించబడుతున్న ,పక్కా బిల్డింగ్ లేక సింగరేణి క్వార్టర్లో నిర్వహిస్తుంటే ,సింగరేణి అధికారులు అంగన్వాడి సెంటర్లు ఖాళీ చేయించి కూలగొట్టినారు.

కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ఈనెల 4 వ తారీఖున  వార్డులో పర్యటించిన సందర్భంగా అంగన్వాడి సెంటర్ నిర్వహించటానికి, ప్రభుత్వ బిల్డింగ్ లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చిన వెంటనే మున్సిపల్ కౌన్సిల్లో జరిగే సమావేశంలో మేయర్ కి మెమోరాండం ఇవ్వమని సూచించారు.

వెంటనే కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ 18 వ డివిజన్ లో 4 అంగన్వాడి సెంటర్లు ఏర్పాటు చేయాలని వార్డులో, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని మాతా శిశువు ఆరోగ్య కేంద్రంలో  , శానిటేషన్ వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, మేయర్ మూడ్  గణేష్ కి మెమోరాండం  ఇచ్చి ప్రజా సమస్యల కొరకు, నిరంతరo ప్రజలకు అందుబాటులో ఉండటం ప్రజా సమస్యల్లో తన గొంతును వినిపించడం ప్రజలు మాకు ఇచ్చిన అదృష్టమని ఈ సందర్భంగా కంచర్ల హిమాశ్రీ తెలియజేశారు.

మరిన్ని వార్తలు