షిప్టెడ్ ఓటర్లకు మరో ఆవకాశం

07-11-2026 | 11:28pm

అదనపు కలెక్టర్ చంద్రయ్య 

బెల్లంపల్లి: ఈసీఐ, సీఈఓ వీడియో కాన్ఫరెన్స్‌లో ఇచ్చిన సూచనల మేరకు షిప్డెడ్ ఓటర్ల(Shipped voters)కు పేరు నమోదుకు మరో అవకాశం కల్పించారు. ఈ మేరకు అదనపు కలెక్టర్ ఈఆర్ ఓ చంద్రయ్య(Additional Collector and ERO Chandrayya), తహసీల్దార్ కృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ సర్వేలో నియోజకవర్గ పరిధిలోని ఓటర్లలో అబ్సెంట్, షిఫ్టెడ్, డెత్, డబుల్ ఓటర్లను గుర్తించి, వారిని ఏఎస్‌డి కేటగిరీ కింద నమోదు చేసి, వారి ఎన్్యూమరేషన్ ఫారాలను అన్‌కలెక్టబుల్‌గా నమోదు చేశారు.

అయితే షిఫ్టెడ్ ఓటర్లకు సంబంధించి మళ్ళీ క్షేత్ర స్థాయిలో సవరణ చేసుకోవడానికి మళ్ళీ అవకాశం ఇచ్చారనీ తెలిపారు. బెల్లంపల్లి మండల పరిధిలోని షిఫ్టెడ్ కేటగిరీలో ఉన్న ఓటర్లు తమ వివరాలను సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్ ద్వారా తిరిగిపరిశీలించుకుని, తమ ఎనుమరేషన్ ఫారాలను సవరణ చేసుకోవాలనీ తెలిపారు. ఈ నెల 21తేదీ లోపు ఎనుమరేషన్ ఫారాలను షిఫ్టెడ్  ఓటర్లు తప్పులు సవరణ చేసుకోవడానికి BLOs ను సంప్రదించాలనీ తెలిపారు. ఈ అవకాశాన్ని బెల్లంపల్లి మండలంలోని సంబంధిత ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు