నాగ సాధువుల మంత్రోచ్ఛారణల మధ్య మహా రుద్రాభిషేకం

29-11-2026 | 09:15pm

ఇల్లెందు టౌన్, నవంబర్ 29 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలోని జేకే కాలనీ గ్రౌండ్‌లో ఆదివారం మహా రుద్రాభిషేకం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) హాజరయ్యారు. నాగ సాధువుల మంత్రోచ్ఛారణలు, వేద మంత్రాల నడుమ శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.

భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శివుని అనుగ్రహం ప్రజలందరిపై ఉండాలని, ఇల్లెందు నియోజకవర్గం సుభిక్షంగా, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. మహా రుద్రాభిషేకం సందర్భంగా భక్తుల సందడితో జేకే కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో పినపాక, అశ్వారావుపేట, భధ్రాచలం శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జారె అదినారయణ, తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ అంకిత్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు