వేసవి తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలి

11-11-2026 | 08:38pm

ఎల్-నినో ప్రభావంపై టేకులపల్లిలో ప్రత్యేక సమీక్ష సమావేశం

టేకులపల్లి, (విజయక్రాంతి): ఎల్-నినో ప్రభావంతో(El Niño effect) రానున్న వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని టేకులపల్లి ఎంపీడీవో శ్రీదేవి(Tekulapalli MPDO Sridevi) అధికారులకు, గ్రామ సర్పంచ్‌లకు సూచించారు. ఇందులో భాగంగా బుధవారం టేకులపల్లి ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో అధ్యక్షతన ఎల్-నినో స్పెషల్ డ్రైవ్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వేసవిలో అన్ని గ్రామాల్లో నిరంతర తాగునీటి సరఫరా జరిగేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. నీటి వనరుల సంరక్షణ, పైప్‌లైన్ లీకేజీల నివారణ, ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకుల (ఓహెచ్‌ఎస్‌ఆర్‌) మరమ్మతులు, క్లోరినేషన్, తాగునీటి నాణ్యత పరీక్షలపై చర్చించారు.

ప్రతి గ్రామంలోని అన్ని ఆవాస ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు వివరించారు. అదేవిధంగా జలసిరి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, గ్రిడ్ ఏఈ, గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, వీబీజీ రామ్‌జీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు