తాడికల్ శివారులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీ
11-11-2026 | 08:47pm
ఏఈ ఫిర్యాదుతో కేసు నమోదు
హుజురాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): కేశవపట్నం మండలం తాడికల్ గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి గురైంది. గుర్తుతెలియని వ్యక్తులు ట్రాన్స్‌ఫార్మర్‌ను అపహరించడంతో విద్యుత్ శాఖ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై ఎన్‌పీడీసీఎల్ ఏఈ సంపత్‌రెడ్డి(NPDCL AE Sampath Reddy) కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఈ ఇచ్చిన దరఖాస్తు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ట్రాన్స్‌ఫార్మర్ చోరీకి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు విచారణ చేపట్టినట్లు కేశవపట్నం ఎస్సై నరేష్‌రెడ్డి తెలిపారు.