విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

11-11-2026 | 09:05pm

జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష 

ఆసిఫాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): విద్యార్థుల్లో చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ మోడల్ స్కూల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్, టీఎంఆర్‌ఈఐఎస్ పాఠశాలల్లో వ్యాసరచన, చిత్రలేఖనం, క్విజ్, ఉపన్యాస పోటీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష విద్యార్థులకు ఉచిత న్యాయసహాయం, బాలల హక్కులు(Child Rights), పోక్సో చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, నల్సా పథకాలపై అవగాహన కల్పించారు. బాలల హక్కులను పరిరక్షించుకోవాలని, చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ రత్నా బాయి పారా లీగల్ వాలంటీర్లు, పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు