అంగన్వాడీ టీచర్ పోస్టుల అర్హుల జాబితా విడుదల

11-11-2026 | 08:45pm

ఈ నెల 16 వరకు అభ్యంతరాల స్వీకరణ సీడీపీఓ ప్రవళిక వెల్లడి

హుజురాబాద్, నవంబర్ 11: (విజయక్రాంతి): హుజురాబాద్ ఐసీడీఎస్ ప్రాజెక్టు(Huzurabad ICDS Project) పరిధిలోని 16 అంగన్వాడీ టీచర్ పోస్టులకు సంబంధించి అర్హులు, అనర్హుల జాబితాను విడుదల చేసినట్లు సీడీపీఓ ప్రవళిక తెలిపారు. ఈ జాబితాలను సంబంధిత గ్రామపంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శించాలని సర్పంచులు, కార్యదర్శులకు సూచించినట్లు పేర్కొన్నారు.

డప్పు చాటింపు ద్వారా గ్రామ ప్రజలకు సమాచారం అందించాలని కోరారు. అభ్యర్థులు గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ప్రదర్శించిన జాబితాలను పరిశీలించుకోవాలని సూచించారు. జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత ధ్రువపత్రాలతో ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు హుజురాబాద్‌లోని దమ్మక్కపేట రోడ్డులో గల సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు