పండగ వాతావరణం లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు
వెల్దుర్తి, నవంబర్ 11,( విజయ క్రాంతి) : వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో(Mangalaparti Village) పండగల ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Houses) గృహప్రవేశ కార్యక్రమం ఆనందోత్సహాల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామాల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి రిబ్బన్ కట్ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ...కూలి పనుల చేసుకుంటూ జీవనం సాగించేవారని,సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారి కుటుంబాలకు రాజన్న చొరవతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం వారి జీవితంలో కొత్త ఆశలను నింపిందని లబ్ధిదారులు తెలిపారు.మాకు సొంతింటి కలను నిజం చేసిన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులకు జీవితాంతం రుణపడి ఉంటామని.
ఇప్పుడు మా స్వగ్రామంలోనే ఉండి పని చేసుకుంటూ ఆనందంగా జీవించగలుగుతున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామ సర్పంచ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రామకృష్ణ, నరసింహారెడ్డి, మల్లేశం, ముక్తా బాయ్,మల్లేష్, ఆయా గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.