పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి..

11-11-2026 | 08:52pm

ఇద్దరు అదుపులో, నలుగురు పరారీ...

సింగరేణి: సింగరేణి(Singareni) మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి శ్రీ కోట మైసమ్మ ఆలయ ప్రాంగణంలో గల ఖాళీ స్థలంలోని జామ తోటలో రహస్యంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు బ్లూ కోల్ట్స్, పోలీస్ సిబ్బందితో కలిసి స్థానిక ఎస్సై వి. రమేష్ హఠాత్తుగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అక్కడ బోడ సంతోష్, లాకవత్ చింటు, మూడు వినోద్, భూక్యా రాజేష్, లాకవత్ రత్నం, మూడు రవి అనే ఆరుగురు వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

వీరిలో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, మిగతా నలుగురు అక్కడికక్కడే పరారయ్యారు. అదుపులోకి తీసుకున్న నిందితుల వద్ద నుంచి ₹13,200 నగదు, ఒక ఆటో, రెండు మొబైల్ ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని, మండలంలో జూదం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై రమేష్ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు