ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి భూమి పూజ..
11-11-2026 | 08:57pm
తాడ్వాయి, నవంబర్ 11 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district) తాడ్వాయి మండలం ఏండ్రియాల గ్రామంలో బుధవారం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం ఏర్పాటుకు ప్రతినిధులు భూమి పూజ నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుడు తొలి స్వాతంత్ర పోరాట వీరులలో ఒకరైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం అధ్యక్షులు బాణాల పెద్ద గంగారెడ్డి, కార్యదర్శి రెడ్డి గారి సిద్ధిరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.